MovieGQ

Ee Veenapaina Palikina Ragam

Abhimanavanthulu (1973) · Track 1 of 5

Song Details

Lyrics

పల్లవి: ఈ వీణ పైన పలికిన రాగం... నాలోన విరిసిన అనురాగం మీటితే మ్రోగేది రాగం... ఎదమాటుగా పెరిగేది అనురాగం మీటితే మ్రోగేది రాగం... ఎదమాటుగా పెరిగేది అనురాగం ఈ వీణ పైన పలికిన రాగం... నాలోన విరిసిన అనురాగం చరణం: 1 కలిమిలోన మిడిసిపడనిది... లేమిలోన కలత పడనిది కలిమిలోన మిడిసిపడనిది... లేమిలోన కలత పడనిది ఇరువురి నడుమా ఎల్లలు లేనిది ఇరువురి నడుమా ఎల్లలు లేనిది వలచిన హృదయల తొలి కలయిక.. ఆ.. ఆ.. ఆ.. ఈ వీణ పైన పలికిన రాగం... నాలోన విరిసిన అనురాగం చరణం: 2 కనిపించే ఆతని చిరు నవ్వులోనా... కవితలకందని మధురభావన.. ఆ.. కనిపించే ఆతని చిరు నవ్వులోనా... కవితలకందని మధురభావన ఆ భావనయే ఆరాధనగా... ఆ భావనయే ఆరాధనగా... అతనికి నేనే ఒక కానుక.. ఆ.. ఆ.. ఆ ఈ వీణ పైన పలికిన రాగం... నాలోన విరిసిన అనురాగం మీటితే మ్రోగేది రాగం... ఎదమాటుగా పెరిగేది అనురాగం ఈ వీణ పైన పలికిన రాగం... నాలోన విరిసిన అనురాగం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Abhimanavanthulu

See All