Song Details
Lyrics
పల్లవి : ఎన్నియల్లో ఒళ్లో పూలజల్లో మల్లియల్లో తల్లో వాన విల్లో ఎన్నియల్లో ఒళ్లే చెమ్మగిల్లో మల్లియల్లో మంచే తేనెజల్లో ఒళ్లోకొస్తే వయ్యారాలు ఇళ్లోకొస్తే సంసారాలు పగలే తారలు ఎన్నియల్లో ఒళ్లో పూలజల్లో మల్లియల్లో తల్లో వాన విల్లో ఎన్నియల్లో ఒళ్లే చెమ్మగిల్లో మల్లియల్లో మంచే తేనెజల్లో చరణం: 1 నడిచొచ్చే నచ్చే వయసులివీ చెలి సొగసులివీ దొరికాయి దోరగా కలిసొచ్చే పిచ్చి మనసులివీ కసి వరసలివీ కలిశాయి కమ్మగా మొగుడికి నచ్చు కన్నె మొగ్గల్లే గిచ్చు తలగడ మంత్రం తాళి కట్టాక చదవచ్చు ప్రేమించుకుంటే వేళాపాళా లేనే లేవులే... లేనే లేవులే ఎన్నియల్లో ఒళ్లే చెమ్మగిల్లో మల్లియల్లో మంచే తేనెజల్లో ఎన్నియల్లో ఒళ్లో పూలజల్లో మల్లియల్లో తల్లో వాన విల్లో చరణం: 2 చిటికేస్తే కాసే కనులు ఇవి ప్రియ కలలు ఇవి నడిరేయే నావగా తడిచేసే తేనె పెదవులివి రసపదవులివి తుడిచేస్తా ముద్దుగా పలకని మాట పదారు వన్నెల పాట పరువపు బాట కులుకుల కులాస తోట పెళ్లాడుకుంటే లైలా మజ్ను గాథే లేదులే... గాథే లేదులే ఎన్నియల్లో ఒళ్లో పూలజల్లో మల్లియల్లో తల్లో వాన విల్లో ఎన్నియల్లో ఒళ్లే చెమ్మగిల్లో మల్లియల్లో మంచే తేనెజల్లో ఒళ్లోకొస్తే వయ్యారాలు ఇళ్లోకొస్తే సంసారాలు పగలే తారలు గాథే లేదులే... గాథే లే దులే
Lyrics sourced from public databases. May contain errors.