Song Details
Lyrics
పల్లవి: దేవతలారా రండి మీ దీవెనలందించండి నోచిన నోములు పండించే నా తోడును పంపించండి కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి పతి రాడనిపించే వరున్నే వరముగ ఇవ్వండి కనీవినీ ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి పతి రాడనిపించే వరున్నే వరముగ ఇవ్వండి కనీవినీ ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి చరణం: 1 శివ పర్వతులేమో ఈ దంపతులనిపించాలి ప్రతి సంసారంలోను మా కథలే వినిపించాలి ఆ సిరిని శ్రీహరిని మా జతలో చూపించాలి శ్రీకాంతుల కొలువంటే మా కాపురమనిపించాలి మా ముంగిలిలోన పున్నమి పూల వెన్నెల విరియాలి మా చక్కని జంట చుక్కలతోట పరిపాలించాలి కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి పతి రాడనిపించే వరున్నే వరముగ ఇవ్వండి కనీవినీ ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి చరణం: 2 తన ఎదపై రతణంలా నిను నిలిపే మొగుడొస్తాడు నీ వగలే నగలంటూ గారాలే కురిపిస్తాడు తన ఇంటికి కళ తెచ్చే మహాలక్ష్మిగ పూజిస్తాడు తన కంటికి వెలుగిచ్చే మణి దీపం నీవంటాడు ఈ పుత్తడి బొమ్మ మెత్తని పాదం మోపిన ప్రతిచోట నిధి నిక్షేపాలు నిద్దురలేచి ఎదురొచ్చేనంటా కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి పతి రాడనిపించే వరున్నే వరముగ ఇవ్వండి కనీవినీ ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి దేవతలారా రండి మీ దీవెనలందించండి నోచిన నోములు పండించే నా తోడును పంపించండి కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి పతి రాడనిపించే వరున్నే వరముగ ఇవ్వండి కనీవినీ ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి
Lyrics sourced from public databases. May contain errors.