Song Details
Lyrics
అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం ఓ అన్నా నీ అనురాగం.. పుట్టిన రోజున మీదీవేనలే వెన్నెల కన్నా చల్లదనం ఓ అన్నా నీ అనురాగం.. మల్లెలవంటి మీమనసులలో చెల్లికి చోటుండాలి ఎల్లకాలము ఈతీరుగానే చెల్లిని కాపాడాలి.. పుట్టిన రోజున మీదీవేనలే వెన్నెల కన్నా చల్లదనం ఓ అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం ఓ అన్నా.. అన్నలు మీరే నాకన్నులుగా నన్నే నడిపించాలి తల్లీ తండ్రీ సర్వము మీరై దయతో దీవించాలి పుట్టిన రోజున మీదీవేనలే వెన్నెల కన్నా చల్లదనం ఓ అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం ఓ అన్నా.. ఇల్లాలినై నేనెచటికేగినా చెల్లిని మదిలో నింపాలి ఆడపడచుకు అన్నివేళలా తోడూ నీడగా నిలవాలి పుట్టిన రోజున మీదీవేనలే వెన్నెల కన్నా చల్లదనం ఓ అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం ఓ అన్నా..
Lyrics sourced from public databases. May contain errors.