Song Details
Lyrics
పావురమా పావురమా మన బ్రతుకే పంజరమా కన్నులలో కాపురమా అందని ఓ గోపురమా పావురమా పావురమా మన బ్రతుకే పంజరమా వెన్నెల్లో మల్లెపూల మంచం వేసి ఉంచాను అందాల మందారాల గందలెన్నో దాచాను కళ్ళల్లో వత్తులు వేసి నీకై వేచి ఉన్నాను వెచ్చని నీ కౌగిలిలోన ఒకటై పోదామన్నాను వన్నెల పామై కరిచిన వేళ కన్నుల ఆశ కరిగిన వేళ జాలైన లేనేలేదా రానేరాదా నీకింకా ఈ బాధ తీరేదెట్టా నువ్వే చెప్పు నాకింకా పావురమా పావురమా మన బ్రతుకే పంజరమా కన్నులలో కాపురమా అందని ఓ గోపురమా పావురమా పావురమా మన బ్రతుకే పంజరమా ఎన్నాళ్లీ ఉపవాసాలు ఎన్నాళ్ళమ్మా వనవాసం శివరాత్రి రాకుండానే చేస్తున్నానే జాగారం ఆకుంది వక్కా ఉంది రెండూ కలిసేదేనాడో పరువాల తాంబూలంతో పెదవుల పండేదేనాడో నెమ్మదిలేని తుమ్మెద గోల తుమ్మెద రాని పువ్వున జ్వాల ఎన్నెన్నో కలలే కన్నా నిన్నా నేడు నీకోసం మౌనంగా ఏడుస్తున్నా నాలో నేను మనకోసం పావురమా పావురమా మన బ్రతుకే పంజరమా కన్నులలో కాపురమా అందని ఓ గోపురమా పావురమా పావురమా మన బ్రతుకే పంజరమా
Lyrics sourced from public databases. May contain errors.