Song Details
Lyrics
అమ్మా అమ్మా కన్నే పువ్వమ్మా నను నువ్వే విడిచిపోయావేళమ్మా గుండెల్లోని గాయం చూడమ్మా నా మానం ప్రాణం నీవేనోయమ్మా అరె ఆడోళ్ల ప్రేమ ఓ నీటి మూట మగవాడి ప్రేమ ఓ రాతి కోట కలలోనైన నిన్నే తలచేనే ఆ కలలే రాక మూగై పోయానే పిల్లనగ్రోవి చేతికి ఇచ్చావే నా శ్వాసలనన్ని పట్టుకు పోయావే చరణం: 1 మగువును నమ్మీ చెడిపోయినోళ్ళు లక్షా ఆ వరసల నిలిపీ నాకు వేసినావే శిక్షా పాముకాటు వేస్తే మన ఊపిరాగుతుందే కన్నె ప్రేమకుట్టేనంటే ప్రతి రోజు చంపుతుందే అరె చేయి విడిచి నువ్వు పోయాక గుండె మూగదై పోయింది నిన్ను నమ్మి నీ వెనకొస్తే మనసంతా ఓ పుండైనాది వలపంటే ఓ ముళ్ళబాటరా అటు నడిచావంటే అశే తీరదురా వలపంటే ఓ మత్తు మందురా అది వేశావంటే ప్రాణం దక్కదురా అమ్మా అమ్మా కన్నే పువ్వమ్మా నను నువ్వే విడిచిపోయావేళమ్మా గుండెల్లోని గాయం చూడమ్మా నా మానం ప్రాణం నీవేనోయమ్మా చరణం: 2 చిల్లులున్న మురళీ అరె పాట పాడగలదూ గుండె గాయమెంతదైనా ప్రేమ బాష మరచిపోదూ ప్రేమ ఉన్నవారు మది వీడి వెళ్ళలేరూ నమ్మి మోసపోతి నేడూ ఇది చెప్పలేని గోడూ నను నీటముంచి నీవెళ్ళొద్దే ఎదుట నిలిచి నను చంపొద్దే కంటి చూపులే కరువైతే మరుక్షణమేలే మనదేలే వన్నెలు చిలికే రామ చిలకమ్మా యద గూటిని దాటి పోయావేళమ్మా ప్రేమలేని ఊయే యాడున్నా నా కళ్ళెమూసి తీసుకుపోవమ్మా అమ్మా అమ్మా కన్నే పువ్వమ్మా నను నువ్వే విడిచిపోయావేళమ్మ గుండెల్లోని గాయం చూడమ్మా నా మానం ప్రాణం నీవేనోయమ్మా అరె ఆడోళ్ల ప్రేమ ఓ నీటి మూట మగవాడి ప్రేమ ఓ రాతి కోట కలలోనైన నిన్నే తలచేనే ఆ కలలే రాక మూగై పోయానే పిల్లనగ్రోవి చేతికి ఇచ్చావే నా శ్వాసలనన్ని పట్టుకు పోయావే
Lyrics sourced from public databases. May contain errors.