MovieGQ

Oh Seethakoka Chiluka

1940 Lo Oka Gramam (2008) · Track 1 of 9 · 4:30

Song Details

Lyrics

ఓ సీతాకోక చిలకా నీకై వేచా మనసా వాచా ఆ మేఘాలల్లో కన్నీళ్ళన్నీ దాచా ఎదనే పరిచా ఏ పొద్దుల్లోనూ ముద్దుల్లోనూ నీతో నేనుంటా ఆ సిగ్గుల్లోనూ ముగ్గుల్లోనూ నీవే నేనంటా ఏనాడైనా ఏ వేళైనా నాలోనా ఏదేమైనా ఎవరేమైనా నీవేనే ఓ సీతాకోక చిలకా నీకై వేచా మనసా వాచా ! ఈ వేళ ఎక్కడ ఉన్నావో ఏమేమి చేస్తూ ఉన్నావో నాకేమో మదిలో నీ ధ్యాసే నీవేమో ఎపుడూ నా శ్వాసే కాసంత కుదురే లేదాయే రేయంత నిదురే రాదాయే నువు లేక కనులలో నీరేలే నువు రాక నిమిషం యుగమేలే ఏ మాట విన్నా నీ పిలుపే యే చోట ఉన్నా నీ తలపే విడలేను లే విడిపోనులే కడదాక నాతో నీవేలే ఓ సీతాకోక చిలకా నీకై వేచా మనసా వాచా !! నా కలల వెన్నెల నీవేనే నీ కనుల చీకటి కనలేనే నా మనసు మాటే వినదేమో ఈ వలపు మాయే విడదేమో నేనేమొ చేపగ మారానే నీవేమొ నీరై పోయావే ఓ క్షణము విడి వడి పోయామా ప్రాణాలు విలవిల లాడేనే నీ పేరు మరువను క్షణమైనా నీ ప్రేమ విడువను కలనైనా కను మూసినా కను తెరచినా నగుమోమే పిలుచును ఏ వేళా ఓ సీతాకోక చిలకా నీకై వేచా మనసా వాచా ఆ మేఘాలల్లో కన్నీళ్ళన్నీ దాచా ఎదనే పరిచా !!!

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from 1940 Lo Oka Gramam

See All